విద్య / ఉద్యోగాలు

ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. 6552 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ESIC Recruitment 2021

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6552 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ క్యాషియర్‌ పోస్టులు 6,306 ఉండగా స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగ ఖాళీలు 246 ఉన్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలతో త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. స్టెనోగ్రఫీ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ కార్పొరేషన్ లో 89 ఉద్యోగాలు..?

అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌/అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ క్యాషియర్‌ ఉద్యోగ ఖాళీలకు మాత్రం ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. డేటాబేస్‌, ఆఫీస్‌ వంటి అంశాలపై కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

రాత పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులకు ఎంపిక చేయడం జరుగుతుంది. 10 నిమిషాల్లో నిమిషానికి 80 పదాలు టైప్‌ చేయగలిగే సామర్థ్యం ఉంటే ఈ ఉద్యోగాలకు సులభంగా ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి. త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో బెల్ లో ఉద్యోగాలు..?

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

Back to top button