కరోనా వైరస్

కరోనా గురించి షాకింగ్ న్యూస్.. బరువు పెరిగితే ముప్పు ఉన్నట్టే..?

భారత్ లో గతంలో విజృంభించిన వైరస్ లతో పోలిస్తే కరోనా మరింత వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మాహమ్మారి పేరు వింటే ప్రజలు గజగజా వణుకుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో లక్షణాలు భిన్నంగా ఉండటంతో పాటు కరోనా లక్షణాలు కనిపించని వాళ్లకు సైతం పాజిటివ్ నిర్ధారణ అవుతుండటం గమనార్హం.

అయితే తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా ఆ అధ్యయనం ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసేలా ఉండటం గమనార్హం. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో బరువు పెరిగితే కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారిలో బీ.ఎం.ఐ విలువ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే కరోనా ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

సాధారణంగా బీ.ఎం.ఐ విలువ 23గా లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. 23ను మించి బీ.ఎం.ఐ విలువ ఉంటే మాత్రం ప్రమాదమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీ.ఎం.ఐ విలువ ఎక్కువగా ఉండటం వల్ల ఆస్పత్రిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఐసీయూలో చేరే అవకాశాలు 10 శాతం ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. 7 మిలియన్ల మందిపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రముఖ జర్నల్ లాన్ సెట్ డయాబెటిక్స్ అండ్ ఎండోక్రైనాలజీలో ప్రచురితమయ్యాయి. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారికి బీ.ఎం.ఐ విలువ ఎక్కువగా ఉంటే కరోనార్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

Back to top button