అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

సినిమా సెట్ లో ఇలా మారిపోయిన పవన్ ను చూసి అంతా షాక్

Everything is shocking to see Pawan change like this on the movie set

Pawan Kalyan and Rana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూటే సపరేటు. ఆయన ఏడాదిలో 4 సినిమాలు చకచకా చేసినప్పుడే అర్థమైంది. సినిమాలకంటే ఆయనకు రాజకీయాలే ముఖ్యం. కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నానని ఓపెన్ గా చెప్పిన నటుడు ఆయన. అందుకే తన సోషల్ మీడియా వాల్ పై ఒక్క సినిమా ప్రమోషన్ కూడా చేయడు. కేవలం ప్రజలు, రాజకీయాలపైనే స్పందిస్తాడు. ఇక ప్రీరిలీజ్ లు, ప్రమోషన్లకు వెళ్లడు. డైరెక్టుగా మూవీ రిలీజ్ చేసేస్తాడు.

అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో కూడా ఒకే టేక్ లో అది బాగా వచ్చినా రాకున్నా ఓకే చెప్పేస్తాడు. ఎందుకంటే ఆయన టైం విలువైనది. అయితే ఈ మధ్య పవన్ లోనూ నటన పట్ల ఆసక్తి పెరిగింది. బాగా రాకపోతే చూసుకొని మరీ టేక్ లు తీసుకుంటున్నాడట..

పవన్ సాధారణంగా ఒక రైటర్, డైరెక్టర్ కూడా. అప్పట్లో జానీ సినిమాను స్వయంగా డైరెక్ట్ చేశాడు. చిరంజీవి సినిమాలోని కొన్ని ఫైట్లను కూడా పవన్ డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ చెప్పిన దానికంటే పవన్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ.

అయితే తాజాగా అయ్యప్పమ్ కోషియమ్ సినిమా సెట్ లో పవన్ తీరు చూసి అంతా షాక్ అయ్యారట.. ప్రతీ సీన్ ను బాగా రాకపోతే మరో షాట్ చేద్దామని పవన్ చెబుతుంటే అంతా షాక్ తింటున్నారు. ఓ సీన్ లో రానా గట్టి స్వరంతో పవన్ ను బెదిరించాల్సి ఉంటుంది. పవన్ పై అభిమానంతో కాస్త టోన్ డౌన్ చేసి రానా అంటే అది బాగా రాలేదని.. ‘గట్టిగా దబాయించు’ అని మరీ రీటేక్ చేయించాడట.. మారిన పవన్ ను చూసి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

Back to top button