తెలంగాణరాజకీయాలు

పాతనేత ఎంట్రీతో మంత్రుల్లో టెన్షన్..!


తెలంగాణ మంత్రులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. సీఎం కేసీఆర్ నుంచి ఆ నేతలకు సడెన్ గా పిలుపు రావడంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మంత్రులకు సైతం ఒక్కొసారి దొరకదనే టాక్ విన్పిస్తుంది. అలాంటిది కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉంటున్న ఆ నేతను సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల భర్తీ సమయంలో పిలువడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సదరు నేతను సీఎం కేసీఆర్ పిలువడం వెనుక పెద్ద మతలబు ఉందని పార్టీలో వాడివేడీగా చర్చ జరుగుతోంది.

Also Read: తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవీ దక్కనుందా?

సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్పై గరగరంగా ఉన్నారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, హోంమంత్రి మహ్మమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు తొలి క్యాబినెట్లో మంత్రులను చాలావరకు పక్కనపెట్టి కొత్తవారికి సీఎం అవకాశం కల్పించారు. ఇక సీఎం క్యాబినెట్లో మంత్రిగా చేసిన తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో ఓటమి పాలవడం, ఆ జిల్లా నుంచి టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ ఒక్కడే గెలుపొందడం, కేటీఆర్ తో సన్నిహిత సంబంధాల కారణంగా పువ్వాడ అజయ్ కు కేసీఆర్ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రి పదవీ దక్కింది.

అయితే పువ్వాడ అజయ్ మంత్రిగా పదవీ చేపట్టి నుంచి నిత్యం ఏదోఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు పార్టీని ఇబ్బందులకు గురిచేస్తుండటంతో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల ఓ దళిత మహిళా సర్పంచ్‌ను వేదికపైకి పిలవకుండా దురుసుగా ప్రవర్తించడం పార్టీలో చర్చనీయాంశమైంది. అలాగే గతంలోనూ మహిళల కండక్టర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఆర్టీసీ బస్సులకు గులాబీ రంగు వేయించడం.. ఆర్టీసీ కార్గో బస్సుల్లో కేసీఆర్‌ ఫొటోలు వేయించారు. ఈ నిర్ణయాలతో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

ఇటీవల గోదావరిలో ఘోర ప్రమాదం జరిగిన స్థలంలో మంత్రి హెలీకాప్టర్‌లో వెళ్లి సెల్ఫీలు దిగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే పార్టీ ఆఫీసులో సీనియర్ నేత తుమ్మల ఫొటోను తీసివేయించడం టీఆర్ఎస్ లో మరో వివాదానికి దారి తీసింది. ఇలా వరుసగా వివాదాల నేపథ్యంలో పువ్వాడకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ చూస్తున్నారని టాక్ విన్పిస్తుంది. దీంతో అదే జిల్లాకు చెందిన సీనియర్, మాజీ మంత్రి తుమ్మలకు కేసీఆర్ మరోసారి అవకాశం ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ పదవుల్లో తుమ్మలకు అవకాశం కల్పించి కేసీఆర్ తన క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం పార్టీవర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో పువ్వాడ అజయ్ తోపాటు ఇతర మంత్రుల్లోనూ టెన్షన్ నెలకొంది. తుమ్మల ఎంట్రీతో ఎవరీ మంత్రి పదవీ ఎసరు పడుతుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు.

Tags
Show More
Back to top button
Close
Close