కరోనా వైరస్

కరోనా నెగిటివ్ వచ్చినా ప్రమాదమే.. వైద్యులు ఏం చెప్పారంటే..?

Experts Says RTPCR Efficiency is 70 to 80% Only

దేశంలో అంచనాలను అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజల్లో కూడా కరోనాపై అవగాహన పెరగడంతో లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే కొంతమంది కరోనా లక్షణాలు కనిపించినా పరీక్షల్లో నెగిటివ్ వస్తుండటంతో తమకు కరోనా సోకలేదని భావిస్తున్నారు. యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా సిటీ స్కాన్ లో కొంతమందికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది.

ఆర్టీ పీసీఆర్ పరీక్ష కరోనా వైరస్ నిర్ధారణకు ఉత్తమమైన పరీక్ష అయినప్పటికీ ఈ పరీక్షలో అన్నిసార్లు కచ్చితంగా కరోనా వైరస్ ను గుర్తించలేమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆర్టీ పీసీఆర్ లో నెగిటివ్ వచ్చినా కరోనా సోకలేదని భావించవద్దని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

లక్షణాలు కనిపిస్తూ నెగిటివ్ వస్తే సీటీ స్కాన్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. మూడు రోజులకు పైగా జ్వరం ఉంటే ఆస్పత్రిలో చేరాలని డాక్టర్లు చెబుతున్నారు. పల్స్ ఆక్సీమీటర్ లో 94 శాతం కంటే ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నా కరోనా అయ్యే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకితే సొంతంగా చికిత్స చేసుకోవద్దని వైద్యులు వెల్లడిస్తున్నారు.

కరోనా లక్షణాలు కనిపించి నెగిటివ్ వచ్చినా వైద్య పరీక్షలు వెంటనే చేయించుకోవాలి. ఆర్టీ పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తే మాత్రం ఇతర పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

Back to top button