ఆరోగ్యం/జీవనం

కరోనా నుంచి కోలుకున్నాక నీరసమా.. ఏం చేయాలంటే..?

Feeling Weak After Recovery From Corona Here Some Tips For To Overcome The Problem

మన దేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. వైరస్ వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. కరోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండి కోలుకుంటున్నారు.

అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఎక్కువమంది నీరసంతో బాధ పడుతున్నారు. కరోనా నెగిటివ్ వచ్చినంత మాత్రాన ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. నీటిని వీలైనంత ఎక్కువగా తాగుతూ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. కొబ్బరి నీటిని తీసుకుంటే మరీ మంచిది.

వైర‌స్ కార‌ణంగా కొంద‌రిలో ఊపిరితిత్తులు బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలుం ఉన్నాయి కాబట్టి ప్రాణాయామం లాంటి వ్యాయామాలు చేస్తే మంచిది. కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత పదిరోజులు మాస్కును క‌చ్చితంగా ధరించడంతో పాటు కుటుంబ సభ్యులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆహారం తీసుకోవడంతో పాటు విటమిన్ సి, జింక్ ట్యాబ్లెట్లను కచ్చితంగా వాడాలి.

కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత జలుబు వేధిస్తే వేడి నీటితో రోజుకు రెండు నుంచి మూడుసార్లు ఆవిరి పట్టుకుంటే మంచిది. నీరసం తగ్గాలంటే త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు మాంసాహారాన్ని బాగా ఉడికిన త‌ర్వాత తీసుకోవాలి. పాల‌కూర‌, ట‌మాట‌, బీట్ రూట్ లను జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచిది. పండ్లు ఎక్కువగా తీసుకుంటే కరోనా వల్ల వచ్చే నీరసానికి సులువుగా చెక్ పెట్టవచ్చు.

Back to top button