క్రీడలుగుసగుసలు

ధోనీలో ఫస్ట్రేషన్.. ఎందుకు సహనం కోల్పోతున్నట్లు..?

ధోనీకి ఇండియానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులూ ఉన్నారు. పొరుగు దేశాల జట్లలోని క్రికెటర్స్‌ కూడా అభిమానులుగా ఉన్నారు. ఇండియాలోనూ క్రికెట్‌ ప్రేమికుల గుండెల్లో కొలువై ఉన్నాడు. కొంత‌మంది విశ్లేష‌కులు ధోనీ లేక‌పోతే ఇండియ‌న్ క్రికెట్టే లేద‌న్నట్టుగా ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. ధోనీ బ్యాటింగ్‌కు దిగాడంటే ఆ షాట్లను చూడకుండా ఎవరూ ఉండలేరేమో. ఒకప్పుడు ఫినిషింగ్‌ టచ్‌ అంటే అది ధోనీతోనే సాధ్యమయ్యేది.

Also Read: ఐపీఎల్ విజేత పోటీ: ఢిల్లీ కప్ సాధిస్తుందా?

ఆ తర్వాత తర్వాత ధోనీ ఫిట్‌నెస్‌ కోల్పోతున్నట్లు కనిపించాడు. చివరకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌‌మెంట్‌ ప్రకటించేశాడు. గత ప్రపంచ కప్‌లోనూ ధోనీ ఆడిన తీరు ఫ్యాన్స్‌ను చాలా వరకు ఇబ్బంది పెట్టింది. కీల‌క‌ స‌మ‌యంలో టెస్టు మ్యాచ్ త‌ర‌హా డిఫెన్స్ ధోర‌ణితో ఆడి విమ‌ర్శల‌ను ఎదుర్కొన్నాడు. ఆ త‌ర్వాత జాతీయ జ‌ట్టుకు ధోనీ దూరం అయ్యాడు. తాజాగా.. ధోనీ ఆట తీరేమిటో ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టు ప్రదర్శనను చూస్తే అందరికీ అర్థం అవుతోంది.

ఒకప్పుడు ఎంతో హూందాగా కనిపించే ధోనీ.. ఇప్పుడు ఆటలోనూ, మైదానంలోనూ ఆయన వ్యవహార శైలిలో మార్పులు కనిపిస్తున్నాయి. మంగ‌ళ‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చెన్నైసూప‌ర్ కింగ్స్ మ్యాచ్ ముగుస్తున్న ద‌శ‌లో అంపైర్‌‌ను ఆల్మోస్ట్ బెదిరించినంత ప‌నిచేశాడు. త‌న బౌల‌ర్ వేసిన వైడ్ బాల్‌ను వైడ్‌గా ప్రక‌టించోయిన అంపైర్‌‌పై ధోనీ అస‌హ‌నం వ్యక్తం చేశాడు. వైడ్ ఇవ్వబోతున్న ఎంపైర్‌‌ కూడా ధోనీ తీరు చూసి వెన‌క్కి త‌గ్గాడంటే ఆ బెదిరింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read: టీవీలకు అతుక్కుపోండి: ఐపీఎల్‌లో నేడు హోరాహోరీ పోరు

సన్‌రైజ్‌ టీంకు చెందిన ర‌షీద్ ఖాన్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో బౌలర్‌‌ శార్దూల్‌ ఠాకూర్‌‌ బంతిని దూరంగా వేశాడు. అప్పటికే ఒక బంతి బ్యాట్స్‌మన్‌కు అంద‌కుండా పోయింది. దాన్ని అంపైర్‌‌ వైడ్‌గా అనౌన్స్‌ చేవాడు. మళ్లీ తర్వాతి బంతికూడా దూరంగా వేశాడు. దాన్ని ఆడేందుకు రషీద్‌ ఖాన్‌ ప్రయత్నించినా కుదరలేదు. అది క్లియ‌ర్‌‌గా వైడ్. దీంతో అంపైర్ మ‌ళ్లీ వైడ్ సిగ్నల్ ఇవ్వబోయాడు. కీప‌ర్‌‌గా ఉన్న ధోనీ వెంట‌నే రియాక్ట్ అయిపోయాడు. అది వైడ్ కాదంటూ అరుస్తూ, త‌న చేతులు చాపి అస‌హ‌నంగా స్పందించాడు. ధోనీ అస‌హ‌నానికి ఆ విదేశీ అంపైర్ కూడా భ‌య‌ప‌డ్డాడు. వైడ్ సిగ్నల్‌ ఇవ్వబోయి ఆగిపోయాడు.

Back to top button