వ్యాపారము

ఏప్రిల్ 30లోపు కచ్చితంగా చేయాల్సిన పనులివే.. లేకపోతే..?

Before Crucial Tasks Finish April 30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు మళ్లీ ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేంద్రం మళ్లీ దేశవ్యాప్తంగా మే నెల 2వ తేదీ తరువాత లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ నెల చివరిలోపు కొన్ని పనులను కచ్చితంగా తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఏదైనా కారణం చేత ఆ పనులను పూర్తి చేయలేకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.

వడ్డీ ఆదాయం, డివిడెండ్స్‌పై టీడీఎస్ ను తప్పించుకోవాలని అనుకునే వాళ్లు ఈ నెలాఖరు నాటికి ఫామ్ 15జీ, ఫామ్ 16హెచ్ లను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులలో ఎవరైనా పన్ను ఆదా చేసుకోవాలని అనుకుంటే ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచి పన్ను ఆదా చేసుకుంటే మంచిది. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనలు మారిన సంగతి తెలిసిందే. సంవత్సరం పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉంటే పొందిన వడ్డీ మొత్తంపై పన్ను పడుతుంది కాబట్టి ముందుగానే హెచ్ఆర్‌కు తెలియజేసి పన్ను భారం లేకుండా చేసుకుంటే మంచిది. పీఎఫ్ కట్రిబ్యూషన్ ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఓపెన్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ విషయంలో వచ్చే త్రైమాసికం నుంచి వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉన్నా పోస్టాఫీస్ స్కీమ్స్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఈ నెలాఖరు లోపు ఈ పనులను పూర్తి చేయకపోతే నష్టపొయే అవకాశం ఉంటుంది.

Back to top button