పండుగ వైభవంలైఫ్‌స్టైల్

నేడే సూర్యగ్రహణం.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే..?

2021 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మే 26వ తేదీన ఏర్పడగా తొలి సూర్యగ్రహణం నేడు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. భారతదేశంపై ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉండదని తెలుస్తోంది. అయితే గ్రహణం సమయంలో కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు. సూర్యగ్రహణం సమయంలో ఏదైనా తినవద్దు. తినడం వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. గ్రహణం సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు.

గ్రహణం సమయంలో పూజలు చేస్తే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి. సూర్యుడిని నేరుగా కళ్లతో చూసే ప్రయత్నం చేయకూడదు. ఆ విధంగా చేస్తే కళ్లకు హాని కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. గ్రహణం ప్రారంభమైన తరువాత గర్భిణీ స్త్రీలు ఏమీ తినకూడదు, తాగకూడదు. గర్భిణీ స్త్రీలు సూది దారం అస్సలు ఉపయోగించకూడదు. గ్రహణానికి ముందుగా స్నానం చేస్తే మంచిది. ఈరోజు సూర్యమంత్రాలు జపిస్తే మంచిది.

కత్తెర, కత్తులు గ్రహణం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఈరోజు ఏదైనా పని చేయాలని అనుకుంటే జ్యోతిష్కులను సంప్రదించి నిర్ణయాలను తీసుకుంటే మంచిది. గ్రహణం ప్రారంభానికి ముందే తినే ఆహారం, ద్రవాలకు తులసి ఆకులను జత చేయాలి. ఇంట్లో పూజ గది ఉంటే ఆ గదిపై సూర్య గ్రహణం నీడ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యగ్రహణం ప్రారంభయ్యాక నిద్రపోకుండా ఉంటే మంచిది.

గ్రహణం సమయంలో దేవతలు, దేవుళ్ల విగ్రహాలు, పటాలను ముట్టుకోకూడదు. గ్రహణం సమయంలో మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు. గ్రహణం సమయంలో కొత్త పనులు చేపడితే అనుకూల ఫలితాలు రావు.

Back to top button