అత్యంత ప్రజాదరణవ్యాపారము

కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్..?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్ షాపింగ్ చేయాలని అనుకునే వాళ్ల కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తులను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో డిస్కౌంట్ ఆఫర్లను పొందే అవకాశం ఉంది. పలు ఉత్పత్తులపై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 80 శాతం డిస్కౌంట్ అందిస్తుండటం గమనార్హం.

ఈరోజు నుంచి సేల్ ప్రారంభం కాగా మే నెల 7వ తేదీ వరకు ఈ ఆఫర్ సేల్ ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ల్యాప్ టాప్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్ససిరీస్, హెడ్‌ఫోన్స్ అండ్ స్పీకర్స్‌పై కూడా భారీ తగ్గింపును అందిస్తుండటం గమనార్హం. రియల్‌మి వేరబుల్ ట్రాకర్స్‌పై ఫ్లిప్ కార్ట్ ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ను అందిస్తుండగా మొబైల్ కవర్స్ అండ్ స్క్రీన్ గార్డ్స్‌పై ఏకంగా 70 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది.

స్మార్ట్‌వాచ్‌ల‌పై, స్టైలింగ్ అండ్ హెల్త్ కేర్ డివైజ్‌లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ను అందిస్తుండటం గమనార్హం. ల్యాప్‌టాప్ యాక్ససిరీస్‌పై కూడా 80 శాతం తగ్గింపు ఉండగా డేటా స్టోరేజ్‌ డివైజ్‌లపై 75 శాతం, ప్రింటర్స్ అండ్ మానిటర్లపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలుస్తోంది. ట్యాబెట్లు, పవర్ బ్యాంకులు, కెమెరా అండ్ యాక్ససిరీస్‌, టీవీ స్ట్రీమింగ్ డివైజ్‌లపై కూడా ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లను అందిస్తుండటం గమనార్హం.

ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. పలు కంపెనీలు టీవీలు, వాషింగ్ మెషీన్ల ధరలు 10,000 రూపాయల లోపే ఉండటం గమనార్హం. అయితే వస్తువులను కొనుగోలు చేసే ముందు ఇతర వెబ్ సైట్లలో వస్తువుల ధరలను, వస్తువుల రివ్యూలను తెలుసుకుని కొనుగోలు చేస్తే మంచిది.

Back to top button