ఆరోగ్యం/జీవనం

చెమటకాయలకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే..?

వేసవికాలం వచ్చిందంటే చాలామంది చెమటకాయల సమస్య వల్ల ఇబ్బంది పడుతుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ వేధించే సమస్యలలో చెమటకాయలు కూడా ఒకటి. శరీరంపై చిన్నచిన్న పింపుల్స్ ఏర్పడటం వల్ల వచ్చే చెమటకాయలతో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. శరీరంపైన చెమట కాయలు ఎక్కడైనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువగా ముఖం, మెడ, ఛాతీ, తొడలపై చెమటకాయలు ఎక్కువగా వస్తాయి.

చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ చెమట గ్రంథులను మూసేయడం వల్ల చెమట చర్మం లోపలే ట్రాప్ అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చెమటకాయలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడం వల్ల ఈ సమస్య దూరమవుతుంది. చెమటకాయలతో బాధ పడుతున్న వాళ్లు బిగుతైన దుస్తులు కాకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

సింథటిక్ దుస్తులను వేసుకోకుండా కేవలం కాటన్ దుస్తులను మాత్రమే వేసుకోవాలి. ఎప్పుడూ హైడ్రేటెడ్‏గా ఉండేలా చూసుకోవడంతో పాటు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి నాచురల్ డ్రింక్స్ తాగితే మంచిది రేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్, హెర్బ్స్ తినడం ద్వారా కూడా చెమటకాయలకు చెక్ పెట్టవచ్చు. వేపుళ్లు, స్వీట్స్ తగ్గించి చర్మాన్ని ఎప్పుడూ తడిగా ఉంచుకోవాలి.

ముల్తానీ మట్టి, పుదీనా పేస్ట్, చల్లని పాలు కలిపి పేస్ట్ లా చేసి చర్మంపై అప్లై చేస్తే చెమటకాయలు తగ్గే అవకాశం ఉంటుంది. చర్మాన్ని చల్లబరచడంలో పెరుగు ఎంతగానో సహాయపడుతుంది. చెమటకాయలు ఉన్నచోట పెరుగును అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచితే స్కిన్ ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. గంధానికి చల్లటి ఫుల్ ప్యాట్ మిల్క్ కలిపి ఆ మిశ్రమాన్ని చెమటకాయలపై రాసినా మంచి ఫలితం ఉంటుంది.

Back to top button