విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉద్యోగాలు..?

FSSAI Recruitment 2021
hand holding a megaphone, which offers great job

దేశంలో గత కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుండటం గమనార్హం.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 38 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ మేనేజర్, ప్రిన్సిపాల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

2021 సంవత్సరం మే 15 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://fssai.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. విడుదలైన నోటిఫికేషన్ లో వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉండటం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసి అవసరమైన డాక్యుమెంట్స్ ను జత చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యూ ఢిల్లీలోని అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.

Back to top button