జాతీయంరాజకీయాలు

మతానికి స్వేచ్ఛ.. సుప్రీం సంచలనం

Freedom of religion .. Supreme sensation

Supreme-Court

దేశంలో మతం అనేది ఇప్పుడు అన్నింటికంటే కూడా బలమైన అస్త్రంగా మారింది. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చాక రాజకీయాలన్నీ మతప్రాతిపదికన విభజించబడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. హిందుత్వం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీకి ఆ వర్గం అండగా నిలవడంతో బలమైన పార్టీగా దేశంలో అవతరించింది. కాంగ్రెస్ అవినీతి లౌకికవాదం కనుమరుగైంది.

అయితే మత మార్పిడులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మతం మారడాన్ని పలు రాష్ట్రాల్లో తీవ్ర నేరంగా పరిగణించి బీజేపీ సీఎంలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మత స్వేచ్ఛపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పును ఇచ్చింది.

భారతదేశంలో 18 ఏళ్లు నిండిన ఏ వ్యక్తి అయినా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చునని.. అనుసరించవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. బలవంతుపు మతమార్పిడులను, చేతబడి వంటి తాంత్రిక విద్యలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకునేలా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటీషన్ పై సుప్రీంకోర్టు శనివారం విచారణ జరిపింది.

ఇలాంటి పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్, ఆయన తరుఫున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ శంకరనారాయణపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఆర్టికల్ 32 ప్రకాశం ఏ రకమైన పిటీషన్ అని నిలదీసింది. ఇలాంటి పిటీషన్ దాఖలు చేసినందుకు మీపై భారీ జరిమానా విధిస్తాం అని న్యాయవాదిని హెచ్చరించింది. న్యాయవాది పిటీషన్ ను వెనక్కి తీసుకుంటానన్న వాదనను తోసిపుచ్చింది. దేశంలో మతానికి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.

Back to top button