తెలంగాణ

హైదరాబాదీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

Power Cuts in Hyderabad

కరెంటు కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరెంటు కోతతో ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. భాగ్యనగరంలో కరెంటు కోతలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జులై నెలలో కురిసిన భారీ వర్షాలతో నగరం మునిగినా ఇప్పుడు చినుకు పడిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఈ సీజన్ లో కరెండు వినియోగం రికార్డు స్థాయిలో ఉంటోంది. దీంతో కరెండు కోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతేడాది ఆగస్టు 5 నుంచి 10 వ తేదీ మధ్య గరిష్ట వినియోగం 44.2 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ ఏడాది అదే సమయంలో గరిష్టం 58.78 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పగటి పూట గరిష్టంగా 34 డిగ్రీల వరకు, రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.

వేసవిలో ఎండలు లేకపోవడం, లాక్ డౌన్ కూడా తోడవడంతో కరెండు వినియోగం పెరగలేదు. వేసవిలో ఒక్కరోజు గరిష్ట వినియోగం 60 మిలియన్ యూనిట్ల లోపే ఉంది. ప్రస్తుత వర్షాకాలంలో నగరంలో దాదాపు ఆ స్థాయిలో వినియోగం ఉంది. మంగళవారం రోజు 58.78 మిలియన్ యూనిట్ల వరకు నమోదైంది. విద్యుత్ డిమాండ్ వేసవిలో 2800 మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 2746 మెగావాట్ల వరకు నమోదవుతోంది. వర్షాలు పడకపోతే ఈ వినియోగం మరింత పెరిగే సూచనులు కనిపిస్తున్నాయి.

నైరుతి రుతుపవనాల ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోతోంది. దీంతో అక్కడ వానలు పడుతున్నాయి. మన దగ్గరకు పశ్చిమం నుంచి పొడిగాలులు వీస్తుండడంతో వేడి ఎక్కువగా ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఏవి లేకపోవడంతో తేమ గాలులు రావడం లేదు. వర్షాలు పడడం లేదు. హైదరాబాద్ లో 15 వరకు ఇలాగే ఉంటే 16 నుంచి 18 మధ్య వానలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది

Back to top button