ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

దుర్గగుడి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ

గత నెల 18న ప్రారంభం కావాల్సిన దుర్గ గుడి ఫ్లైఓవర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా రావడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన కరోనా నుండి కోలుకోవడంతో ఈ నెల 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారని ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వర్చ్యువల్ పద్దతి ద్వారా ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ప్రారంభిస్తారు. ఆ రోజు మొత్తంగా రూ.15 వేల 622 కోట్ల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.

Also Read: బీజేపీ స్ట్రాటజీ: పోయే వాళ్లు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు?

Back to top button