క్రీడలు

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ మార్పుపై గంభీర్ ఏమన్నాడంటే?

Gambhir comments on Kolkata Knight Riders captaincy change

కరోనా టైంలోనూ ఐపీఎల్-2020 క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్-2020లో సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. దీంతో ప్రస్తుత మ్యాచులన్నీ రసవత్తరంగా సాగుతున్నాయి. ఆయా జట్లు పాయింట్ల పట్టికలో ముందుండేందుకు యత్నిస్తుండటంతో ప్రతీ మ్యాచ్ నువ్వా.. నేనా అన్నట్లు సాగుతూ క్రికెట్ ప్రియుల్లో జోష్ నింపుతున్నాయి.

Also Read: ఐపీఎల్: పంజాబ్‌ జట్టు ఫామ్‌లోకి ఎందుకు రావట్లేదు..?

తాజాగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది. గత రెండేళ్లుగా కోలకత్తా నైట్ రైడర్స్ కు దినేష్ కార్తీక్ కెప్టెన్ కొనసాగుతున్నారు. అయితే ఉన్నఫలంగా అతడు కెప్టెన్సీ పదవీ నుంచి తప్పుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది. ఆటపై దృష్టిసారించేందుకే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నానని దినేష్ కార్తీక్ చెబుతున్నా ఫ్యాన్స్ మాత్రం నమ్మడం లేదు.

కార్తీక్ రాజీనామా వెనుక వేరే కారణం ఉందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈనేపథ్యంలో కోలకత్తా నైట్స్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ మధ్యలో కెప్టెన్ ను తప్పించడాన్ని ఆయన తప్పుబట్టారు. సీరీసు మధ్యలో కెప్టెన్ ను మార్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనమే ఉండదన్నారు.

క్రికెట్ అనేది రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన అంశం కాదని.. నిజాయతీగా చెప్పాలంటే ఆటతీరుకు సంబంధించినది అని గంభీర్ వ్యాఖ్యానించాడు. లీగ్ ప్రారంభంలోనే కెప్టెన్‌గా మోర్గాన్ నియమించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీజన్ మధ్యలో కెప్టెన్‌ను మార్చేంత చెత్తగా ప్రదర్శనమేమీ కోల్‌కతా చేయలేదని గంభీర్ అన్నారు.

Also Read: సన్‌‘రైజ్‌’ కావాలంటే మార్పులు చేయాల్సిందేనా?

కెప్టెన్సీ మార్పు గురించి తెలియగానే తాను కూడా ఆశ్చర్యపోయినట్లు గంభీర్ తెలిపాడు. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ జట్టులో ఉన్నాడని దినేశ్ పై జట్టు యాజమాన్యం ఒత్తిడి పెంచే బదులు ముందుగానే కెప్టెన్సీ బాధ్యతలు మోర్గాన్‌కు అప్పగించాల్సి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే జట్టులోని సభ్యులు పదేపదే అతడిపై మేనేజ్ మెంట్ కు ఫిర్యాదు చేయడంతోనే కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకొని ఉండొచ్చని గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Back to top button