ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Ghora road accident in Nellore district

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు  ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. మదనపల్లి వైపు నుంచి వస్తున్న లారీని విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.

Back to top button