గత కొన్ని రోజులుగా సామాన్యునికి అందని స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగాన దేశీ మార్కెట్లో మాత్రం తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్లు కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.53,820కి చేరింది. అదే 22 క్యారెట్లు కలిగిన 10 గ్రాముల ధర 49,340కి మారింది. ఇక వెండి రూ.900 తగ్గడంతో ప్రస్తుతం 67,000కి చేరింది. బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినా కొనుగోలు శక్తి పెరుగుతుందా.. లేదా.. అనేది చూడాలి.