వ్యాపారము

బంగారం కొనేవాళ్లకు శుభావార్త.. భారీగా తగ్గిన ధరలు..?

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశానికి చెందిన వాళ్లు బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారనే సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. పసిడి రేటు నేలచూపులు చూస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. బంగారం ధర తగ్గుతున్నా వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం.

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గడంతో పసిడి రేటు రూ.47,890గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గగా ప్రస్తుతం రూ.43,900గా ఉంది. ఒకవైపు బంగారం ధర తగ్గితే మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం. కేజీ వెండి ధర రూ.73,100 వద్దనే కొనసాగుతుండగా డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే వెండి ధర తగ్గడం లేదని తెలుస్తోంది.

దేశీయంగా బంగారం ధరలు ఈ విధంగా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర భారీగా పెరిగింది. 0.10 శాతం పైకి కదిలి ఔన్స్ బంగారం ధర 1784 డాలర్లకు ఎగసింది. వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం. ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 25.93 డాలర్లకు తగ్గిన సంగతి తెలిసిందే. బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయి.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, వాటి వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు ఇతర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి.

Back to top button