వ్యాపారము

బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు..?

Gold Price On April 15th

దేశంలో మార్చి నెల చివరి వారం వరకు బంగారం ధరలు తగ్గగా ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం, బుధవారం బంగారం ధరలు తగ్గగా నేడు బంగారం ధరలు పెరగడం గమనార్హం. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 400 రూపాయలు పెరగడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం ధర 46,352 రూపాయల నుంచి 46,706 రూపాయలకు చేరింది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 42,783 రూపాయల నుంచి 42,852 రూపాయలకు చేరడం గమనార్హం. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుంటే మరోవైపు వెండి ధరలు కూడా పెరగడం గమనార్హం. కిలో వెండి ధర 66,444 రూపాయల నుంచి ఏకంగా 67,953 రూపాయలకు చేరింది. బంగారం కొనుగోలు చేసేవాళ్లు ధరలు తెలుసుకుని బంగారం కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో కూడా బంగారం, వెండి ధరలు పెరగదం గమనార్హం. బంగారం ధర ఔన్స్ కు 0.16 శాతం పెరుగుదలతో 1738 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్ కు 0.24 శాతం పెరుగుదలతో 25.58 డాలర్లకు చేరడం గమనార్హం.

బంగారం, వెండి ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, ధరల్లో మార్పులు బంగారం ధర పెరుగుదలకు కారణమవుతాయి.

Back to top button