ప్రత్యేకంవిద్య / ఉద్యోగాలు

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు..!


ఇంజనీరింగ్ చదివిన ఉద్యోగులకు ఇండియన్ ఆర్మీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాత పరీక్ష లేకుండా 191 టెక్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఈ ఉద్యోగాలకు ఏకంగా 56,000 రూపాయలు వేతనం రూపంలో చెల్లిస్తారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్ విధానం ద్వారా ఇండియన్ ఆర్మీ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అవివాహిత బీఈ/బీటెక్‌ విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

191 టెక్ ఉద్యోగాలలో 175 ఉద్యోగాలు పురుషులకు కాగా మహిళలకు 14 ఉద్యోగాలు, ఆర్మీ విడోలకు 2 పోస్టులు ఉంటాయి. ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఇంటర్వ్యూల్లో చూపే ప్రతిభ ఉద్యోగానికి ఎంపిక కావడం లేదా కాకపోవడనికి కారణం కానుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి పీజీ డిప్లొమా ప్రధానం చేసి లెఫ్టినెంట్ హోదా ఉద్యోగం కల్పిస్తారు.

పురుషులకు కేటాయించిన 175 ఉద్యోగాల్లో సివిల్‌-49, కంప్యూటర్‌ సైన్స్‌-47, ఎల్రక్టానిక్స్, అనుబంధ విభాగాల్లో – 29, ఎల్రక్టికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌-16, మెకానికల్‌-15, ఏవియానిక్స్‌ విభాగం – 5, ఏరోనాటికల్‌ విభాగం – 5, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మరియు ఆటోమొబైల్ రంగాలలో 2 చొప్పున, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్, టెక్స్‌టైల్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

మహిళలకు కేటాయించిన 14 ఉద్యోగాల్లో కంప్యూటర్ 4, సివిల్ 3, ఎలక్ట్రానిక్స్ 2, ఎలక్ట్రికల్ 2, ఏరోనాటికల్, మెకానికల్, ఆర్కిటెక్చర్ లలో ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.joinindianarmy.nic.in/ ద్వారా నవంబర్ 12వ తేదీలోపు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Back to top button