ఇంటర్నేషనల్కరోనా వైరస్

భారత ప్రజలకు శుభవార్త.. ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్..?

దేశంలోని ప్రజల్లో ఏ ఒక్కరిని కదిలించినా కరోనా వ్యాక్సిన్ గురించే చర్చ జరుగుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో అడ్డుకట్ట వేయగలదని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఎంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అంత త్వరగా మహమ్మారి బారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. రష్యా కరోనా వ్యాక్సిన్ పై భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతులు ఇచ్చింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ కు క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి అనుమతులు లభించనున్నాయి. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో 100 మంది, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో 1400 మంది పాల్గొంటారని తెలుస్తోంది.

రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో రెడ్డీస్ లేబరేటరీస్ కలిసి పని చేసి ఈ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించనుంది. మరోవైపు రష్యా ఎపినావ్ పేరుతో మరో కరోనా వ్యాక్సిన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. రష్యా కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే ఆ దేశ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో మంచి ఫలితాలను సాధించింది. అయితే ఈ వ్యాక్సిన్ తక్కువ సమయంలో తయారు కావడంతో ఈ వ్యాక్సిన్ విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి.

మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో ఒక దశలో 10,000కు పైగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 4,000 లోపే కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో దేశంలో పూర్తి స్థాయిలో కరోనా తగ్గుముఖం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

Back to top button