తెలంగాణవిద్య / ఉద్యోగాలు

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఎంసెట్ లో వెయిటేజీ డౌటేనంట..!

Eamcet Exams
కరోనా వైరస్, లాక్ డౌన్ ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఇలాంటి సమయంలో పోటీ పరీక్షలకు ఇంటర్ వెయిటేజీ మార్కులు కలపడం వల్ల కొందరు విద్యార్థులకు లాభం చేకూరుతుంటే మరికొందరు విద్యార్థులకు నష్టం కలుగుతోంది. వెయిటేజీ మార్కులపై విద్యార్థుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.

Also Read: వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

అయితే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ పరీక్షకు వెయిటేజీ మార్కులు కలిపే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుంచి ఎంసెట్ లో మార్పులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సైతం మొదట్లో వెయిటేజీ మారుకులను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత వెయిటేజీ మార్కులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఎంసెట్​ ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేతపై ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ పాత విధానమే అమలవుతున్న నేపథ్యంలో త్వరలో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. నిపుణులతో చర్చల అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్​ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది.

Also Read: హైబీపీ ఉన్నవాళ్లు ఈ పండు తింటే చాలు..!

ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎంసెట్ వెయిటేజీని తొలగిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందనే చెప్పాలి.

Back to top button