జాతీయంవిద్య / ఉద్యోగాలు

పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఎక్కువ మొత్తం డబ్బులు..?


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మోదీ సర్కార్ ఇప్పటికే పలు స్కీమ్ లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లలో ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్ అమలు ద్వారా సామాన్య ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయిన నేపథ్యంలో ఈ స్కీమ్ అమలు ద్వారా భారత్ లో ఉపాధి అవకాశాలను భారీగా పెంచాలని భావిస్తోంది. గత నెల ఒకటో తేదీ నుంచి మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా వచ్చే ఏడాది జూన్ నెల వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. అయితే కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులను అందిస్తోంది.

అయితే కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా అందరూ ప్రయోజనం పొందలేరు. కొత్తగా ఉద్యోగంలో ఎవరినైనా కంపెనీ చేర్చుకుంటే వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ సంవత్సరం మార్చి నెల ఒకటీ తేదీ నుండి సెప్టెంబర్ నెల 30వ తేదీ మధ్యలో ఉద్యోగం కోల్పోయి పీఎఫ్ అకౌంట్ లేని వాళ్లకు మాత్రమే కేంద్రం ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఉద్యోగులు వేతనం నుంచి చెల్లించే పీఎఫ్ తో పాటు కంపెనీ పీఎఫ్ ను కూడా కేంద్రం చెల్లిస్తుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంట్రిబ్యూషన్ 24 శాతం ఉండగా పీఎఫ్ కంట్రిబ్యూషన్ లో ఉద్యోగి 12 శాతంగా, కంపెనీ వాటా 12 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగంలో చేరిన వారికి ఏకంగా 24 నెలల పాటు పీఎఫ్ డబ్బులను చెల్లిస్తుంది.

Back to top button