ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

దేశ ప్రజలకు శుభవార్త.. మరో కరోనా వ్యాక్సిన్ సక్సెస్..?


‘ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తలు తయారు చేసిన మరో కరోనా వ్యాక్సిన్ సక్సెస్ అయింది. వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలోని సినోటాక్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని వెల్లడైంది. పావో పాలో బూటాంటాన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.

చివరి దశలో 9,000 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ను ప్రయోగించి వారిలో ఒక్కరు కూడా అస్వస్థతకు గురి కాకపోవడంతో వ్యాక్సిన్ సురక్షితమేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తంగా 15,000 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి కరోనా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేల్చారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ తో పోరాడే యాంటీబాడీలను తయారు చేస్తుందని.. త్వరలో వ్యాక్సిన్ సమర్థతకు సంబంధించిన పూర్తిస్థాయి ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

2021 జనవరి నెల నుంచి ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ఆమోదానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని త్వరలోనే కరోనా వ్యాక్సిన్ కు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ ను కట్టడి చేస్తే మాత్రమే భారత్ లో కానీ, ఇతర దేశాల్లో కానీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి.

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే చాలా సమయమే పడుతుందని.. ఏ దేశమైనా ప్రాధాన్యత ఆధారంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తుందని శాస్త్రవేత్తలు, నిపుణులు అబిప్రాయపడుతున్నారు.

Back to top button