ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

దేశ ప్రజలకు శుభవార్త.. వృద్ధులకూ పని చేస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్..?

Corona Vaccine
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే యాక్సిన్ తయారీ పనుల్లో తలమునకలై ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే కరోనా మహమ్మారికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసమే ప్రపంచ దేశాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆక్స్ ఫర్డ్ తాజాగా ఒక శుభవార్త చెప్పింది.

Also Read: సాధారణ జలుబుతో బాధ పడేవాళ్లకు కరోనా రాదంట..?

ప్రస్తుత్న ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. శాస్త్రవేత్తలు సాధారణంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ వృద్ధులపై పని చేసే అవకాశాలు తక్కువని చెబుతూ ఉంటారు. అయితే కరోనా వ్యాక్సిన్ మాత్రం వృద్ధుల్లోను సమర్థవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కరోనా వ్యాక్సిన్ వృద్ధుల్లోనూ యాంటీబాడీలు, టి-కణాలను ప్రేరేపించిందని.. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లలోనూ వ్యాక్సిన్ బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనలను ఉత్పత్తి చేసిందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అంతిమంగా వృద్ధులకు కూడా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది. అయితే వ్యాక్సిన్ గురించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Also Read: హైబీపీ ఉన్నవాళ్లు ఈ పండు తింటే చాలు..!

మరోవైపు బ్రిస్టల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ జెనెటిక్ సూచనలు పాటిస్తుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత వ్యాక్సిన్ ఏ విధంగా పని చేస్తుందో తెలియాల్సి ఉంది.

Back to top button