ఆరోగ్యం/జీవనంకరోనా వైరస్

ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని సీఎం ప్రకటన..!

Good news people corona vaccine will be free
ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నా పూర్తిస్థాయిలో వైరస్ తగ్గుముఖం పట్టాల్సి ఉంది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే తప్ప వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా సామాన్య ప్రజలకు వ్యాక్సిన్ చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అందుబాటులోకి ఆ సేవలు..?

అయితే కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా రాష్ట్రంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ఇస్తామని తెలిపారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు.

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ ఖరీదు వేల రూపాయలు ఉండే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ప్రజలకు అదిరిపోయే శుభవార్తేనని చెప్పాలి. ఫ్రీగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించడం వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడదు. త్వరలో ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇదే తరహా ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ‘కాళరాత్రి అమ్మవారు’గా ఏడవ రోజు దర్శనం..!

అయితే ఫ్రీ కరోనా వ్యాక్సిన్ ప్రకటనపై ప్రతిపక్షం నుంచి మాత్రం విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Back to top button