వ్యాపారము

కేంద్రం సూపర్ స్కీమ్.. నెలకు రూ.10,000 పెన్షన్ పొందే ఛాన్స్..?

Atal Pension Yojana Scheme
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలలో కొన్ని పథకాలు పెన్షన్ స్కీమ్స్ కాగా మరికొన్ని స్కీమ్స్ ఆరోగ్య రక్షణ స్కీమ్స్ కావడం గమనార్హం. అయితే రిటైర్మెంట్ తర్వాత ఏ ఇబ్బందులు లేకుండా జీవనం సాగించాలని భావించే వాళ్ల కొరకు ఒక స్కీమ్ అమలవుతోంది. అటల్ పెన్షన్ యోజన పేరుతో ఈ స్కీమ్ అమలవుతూ ఉండటం గమనార్హం.

అసంఘటిత రంగంలో పని చేస్తున్న వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరడానికి అర్హులు. ఎవరైతే స్కీమ్ లో చేరతారో వాళ్లు ప్రతి నెలా డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. వయస్సు ప్రాతిపదికన డబ్బు చెల్లించాల్సి ఉండగా 60 సంవత్సరాల వరకు డబ్బును కడుతూ రావాల్సి ఉంటుంది.

39 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండే వివాహిత జంటలు ఈ స్కీమ్ కొరకు విడిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన దంపతులు 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు 10,000 రూపాయల చొప్పున సమిష్టి పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు గల భార్యాభర్తలు నెలకు 577 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

దంపతులకు 35 సంవత్సరాల వయస్సు నిండితే మాత్రం నెలకు 902 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరడం వల్ల తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

Back to top button