ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్

గుంటూరు: మొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం

Guntur: A huge fire broke out in a mobile shop

గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ఓ మొబైల్ షాపులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ మంటలు పక్కషాపులకు కూడా వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. కాగా పోలీసులు అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేక ఇతర కారణాలున్నాయా..? అనేకోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Back to top button