అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలు

దారుణం: అప్పు తీర్చమన్నందుకు ఈ మహిళను ఆటోడ్రైవర్ ఏం చేశాడంటే?

అప్పుగా ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడు. వాటితో తన అవసరాలు తీర్చుకున్నాడు. తీరా అప్పుతీర్చమని అడిగినందుకు మహిళపై ఓ ఆటో డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా కృష్ణా నది కరకట్టపై జరిగిన ఈ దారుణం చూసి అందరూ అవాక్కవుతున్నారు.

ఇచ్చిన బాకీ డబ్బులు అడిగినందుకు మహిళ అని కూడా చూడకుండా ఓ ఆటోడ్రైవర్ కాలితో తన్నాడు. ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇదంతా కొందరు ఫొటోలు తీయడంతో విషయం వెలుగుచూసింది.

తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన ఒక మహిళ ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటలో నివాసం ఉంటోంది. ఈ మహిళ మహానాడులో ఉన్న సమయంలో చిర్రావూరుకు చెందిన గోపికృష్ణ అనే యువకుడు తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. గోపీకృష్ణకు ఈ మహిళ 3 లక్షల రూపాయలు అప్పుగా ఇప్పించింది. గోపీకృష్ణ ఆ డబ్బుతో ఆటో తీసుకొని నడుపుతున్నాడు. త్వరలోనే అప్పు తీరుస్తానని చెప్పి గోపీకృష్ణ తీర్చలేకపోయాడు.

దీనిపై మహిళ చిర్రావూరుకు వెళ్లి నిలదీసి అడిగింది. అయితే కృష్ణా నది కరకట్టపైకి తీసుకెళ్లిన గోపీకృష్ణ సర్ది చెప్పాడు. అయినా పదే పదే డబ్బులు అడగడంతో ఆగ్రహంతో ఆ ఆటోడ్రైవర్ ఎగిరి కాలితో తన్నాడు.దానికి పాపం మహిళ ఎగిరి అల్లంత దూరాన పడిపోయారు. ఒక్కసారిగా కుప్పకూలింది. దీన్ని కొందరు ఫొటోలు తీయడంతో బయటకొచ్చింది. మహిళ గాయపడడంతో మంగళగిరి ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మహిళను తన్నిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Back to top button