కరోనా వైరస్

ప్రజలకు షాక్.. ఈ లక్షణాలున్నా కరోనా సోకినట్టే..?

New Corona Symptoms

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా సోకిన వారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులతో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. తలనొప్పి, నీరసం ఉన్నా కరోనా కావచ్చని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. కనుగుడ్డు నుంచి సైతం శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తోంది.

కీళ్ల నొప్పుల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయవద్దని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం కరోనా సోకుతున్న వారిలో యువతే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మాస్క్ ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, శానిటైజర్లను వినియోగించకపోవడం వల్ల కరోనా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 20 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లకు ఎక్కువగా కరోనా సోకుతోందని వైద్యులు చెబుతున్నారు.

అయితే కరోనా లక్షణాలు కనిపిస్తున్నా కొంతమంది యువకులు చికిత్స చేయించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. నిర్లక్ష్యం చేస్తున్న యువత వల్లే వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

గతంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకడానికి అయిదు నుంచి ఏడు రోజుల సమయం పట్టగా ప్రస్తుతం ఒకటి నుంచి రెండు రోజుల్లోనే ఇతరులకు కరోనా సోకుతోంది

Back to top button