ఆరోగ్యం/జీవనంజనరల్

దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

Cinnamon Powder

వంటలకు రుచితో పాటు సువాసనను అందించే దాల్చిన చెక్కను బిర్యానీ, పలావు లాంటి వంటకాలలో ఎక్కువగా వినియోగిస్తారు. దాల్చిన చెక్కను పొడి చేసుకుని తీసుకున్నా దాల్చిన చెక్కను వినియోగించి చేసిన వంటలను తీసుకున్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదయాన్నే టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. దాల్చిన చెక్క ద్వారా శరీరానికి అవసరమైన పీచు, కాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు లభిస్తాయి.

Also Read: మతిమరపుతో బాధ పడుతున్నారా.. జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలివే..?

టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేయడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల పేగుల్లో ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్య తొలగుతుంది. రక్తం గడ్డ కట్టడాన్ని అరికట్టడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేయడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.

Also Read: విస్కీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..?

దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. శరీరానికి రోజంతా సరిపడా శక్తిని ఇవ్వడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క క్యాన్సర్ కారకాలతో పోరాడటంతో పాటు కణాలు నష్టపోకుండా చేయడంలో సైతం తోడ్పడుతుంది. దాల్చిన చెక్కతో టీని కూడా తయారు చేసుకుని సులభంగా తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. గుండె సంబంధ రోగాలను దాల్చిన చెక్క తగ్గిస్తుంది. చర్మం మంటగా ఉన్నా, అలర్జీలు ఏర్పడినా దాల్చిన చెక్కను తీసుకోకూడదు.

Back to top button