తెలంగాణరాజకీయాలు

రాజధానిలో భారీ వర్షం!

రాష్ట్ర రాజధానిలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న నగర వాసులకు ఒక్కసారిగా కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే పెద్ద పెద్ద ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల పలు చోట్ల చెట్లు పడిపోయాయి. రోడ్లమీద నీళ్లు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల మోకాలి వరకు నీళ్లు ఆగిపోయాయి. వర్షం వల్ల కాస్త ఎండ వేడిమి తగ్గినా, కరెంటు పోవడంతో ఇబ్బందిగా మారింది. జూబ్లిహిల్స్ లో పలుచోట్ల చెట్లు కూలాయి. చెట్ల కొమ్మలు విరిగి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

ఖైతరాబాద్ మొదలు ఎల్బి నగర్ వరకు పలు చోట్ల భారీ వర్షం ఏకబిగిన ముప్పావు గంటకు పైగానే పడింది. రాష్ట్రంలో అక్కడక్కడా వర్షం కురుస్తోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కడైతే నమోదవుతాయో అక్కడ ఈ మేఘాలు ఏర్పడతాయని తెలిపింది.

Tags
Show More
Back to top button
Close
Close