అత్యంత ప్రజాదరణటాలీవుడ్సినిమా

ఎక్స్ పోజింగ్ కి హద్దు అదుపు లేదట !


చిన్న సినిమాతో పెద్ద హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ ‘హెబ్బా పటేల్’. నిజానికి మూడు సంవత్సరాల క్రితం వరకూ హెబ్బాకి ఉన్న డిమాండ్, తోటి హీరోయిన్స్ అబ్బా అనుకునేలా సాగింది. కానీ వచ్చిన సక్సెస్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో హెబ్బా తొందర పడింది. వచ్చిన సినిమా వచ్చినట్లుగా రెచ్చిపోయి మరీ చేసేసింది. ప్లాప్ ల వలయంలో చివరికి విలువే కోల్పోయింది. అయితే ఎన్ని కోల్పోయినా హెబ్బా అసలు తగ్గడం లేదు. ఏది దొరికితే అది చేసేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ఆ క్రమంలోనే వెబ్ సిరీస్ లు, భీష్మలో ఐటమ్ రోల్.. ఇలా ఈ గ్లామర్ ప్రపంచంలో నాలుగు రాళ్లు సంపాధించుకోవడానికి హెబ్బా ఏ మాత్రం మోహమాటపడకుండా తనకు ఉన్న ఆ కొద్ది అందచందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో చేసిన సినిమానే ‘రెడ్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో హెబ్బా ఓ ఐటమ్ సాంగ్ చేసింది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ లో హెబ్బా ఎక్స్ పోజింగ్ కి హద్దు అదుపు లేకుండా ఉంటుందట.

అంటే… గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్ కోసం హద్దు మీరి మరి ఎక్స్ పోజ్ చేసింది అన్నమాట. ఇక ఈ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ అండ్ హెబ్బా మీద లాక్ డౌన్ కి ముందే షూట్ చేశారు. సాంగ్ అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా హెబ్బా స్టెప్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్, తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటించారు.

Tags
Back to top button
Close
Close