అత్యంత ప్రజాదరణఆరోగ్యం/జీవనం

పుచ్చకాయ గింజలు తింటే ప్రమాదమా..? వైద్యులు ఏం చెప్పారంటే..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. వేసవికాలంలో ఎక్కువగా లభ్యమయ్యే పుచ్చకాయలను ప్రతిఒక్కరూ తింటారు. పుచ్చకాయలు తినే సమయంలో పుచ్చకాయ గింజలను కూడా చాలామంది తినేస్తూ ఉంటారు. అయితే పుచ్చకాయ గింజలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వైద్యులు చెబుతున్నారు.

పుచ్చకాయల్లో ఉండే గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రోటీన్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు మన శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల బారి నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయ గింజల ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, అమైనో యాసిడ్స్, మెగ్నీషియం, ఐరన్, జింక్ లభించడం జరుగుతుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో పుచ్చకాయ గింజలు ఎంతగానో తోడ్పడతాయి. పుచ్చకాయ గింజలు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. హైబీపీ సమస్యకు చెక్ పెట్టడంలో పుచ్చకాయ ఎంతగానో సహాయపడుతుంది. హైబీపీతో బాధ పడేవాళ్లు పుచ్చకాయ గింజలను తీసుకుంటే మంచిది. కొంతమందికి డయాబెటిస్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు పుచ్చకాయలు తింటే అందులో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ లెవెల్స్ ను సమతుల్యం చేస్తుంది. పుచ్చకాయ గింజలలో ఎల్ ఆర్గినిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. గాయాలను త్వరగా తగ్గించడంలో ఎల్ ఆర్గినిన్ తోడ్పడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో పుచ్చకాయ గింజలు ఎంతగానో సహాయపడతాయి.

Back to top button