ఆరోగ్యం/జీవనం

జిమ్ కు వెళ్లకుండా సులువుగా బరువు తగ్గొచ్చు.. ఎలా అంటే..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమంది ఊబకాయం బారిన పడుతున్నారు. మానసిక శ్రమ పెరిగి శారీరక శ్రమ తగ్గడంతో ఎక్కువమంది అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు. బరువు తగ్గడం కోసం చాలామంది జిమ్ లను ఆశ్రయిస్తున్నారు. అయితే రోజువారీ పనులతో భాగంగా సులభంగా బరువు తగ్గవచ్చు.

బరువు తగ్గాలని భావించే వాళ్లు శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు కారు, బండిపై ఆధారపడకుండా బరువు తగ్గితే మంచిది. చాలామంది ఆన్ లైన్ షాపింగ్ పై ఆధారపడుతూ చాలమంది షాపింగ్ మాల్స్ కూడా వెళ్లడం లేదు. ఆన్ లైన్ షాపింగ్ కు బదులుగా షాపింగ్ మాల్ కు వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత పొందడంతో పాటు ఫిట్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శరీరంలో వేగంగా కేలరీలను కరిగించాలని అనుకుంటే ఇంటిని శుభ్రం చేయడం ద్వారా 100 క్యాలరీలను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. డ్యాన్స్ చేయడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. డ్యాన్స్‌ చేయడం ద్వారా వేగంగా క్యాలరీలు ఖర్చు అవుతాయని ఫిట్‌నెస్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

చాలామంది ఆహారం తిన్న వెంటనే నిద్రపోతూ ఉంటారు. అలా చేయకుండా భోజనం చేసిన తరువాత కొంత సమయం నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉండటంతో పాటు 100 క్యాలరీలు ఖర్చవుతాయి.

Back to top button