టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Prabhas Upcoming Films: ప్రభాస్ నుండి ఈ ఏడాదిలో 3 భారీ చిత్రాలు !

ప్రభాస్ లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా నేషనల్ స్టార్ అయ్యాక తన స్టైల్ మార్చాడు, తన సినిమాల సెలెక్షన్ మార్చాడు. ఏ హీరో చేయలేనంత స్పీడ్ గా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా మిగిలిన స్టార్స్ కంటే ముందుగానే

Prabhasప్రభాస్(Prabhas) లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా నేషనల్ స్టార్ అయ్యాక తన స్టైల్ మార్చాడు, తన సినిమాల సెలెక్షన్ మార్చాడు. యూనివర్సల్ సబ్జెక్ట్ లతోనే సినిమా చేస్తూ ప్రభాస్ నిజంగానే రియల్ పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్నాడు. అదే గతంలో అయితే, ప్రభాస్ సినిమా తర్వాత సినిమా చేసేవాడు.

కానీ, ఇప్పుడు ఏ హీరో చేయలేనంత స్పీడ్ గా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. పైగా మిగిలిన స్టార్స్ కంటే ముందుగానే తన సినిమాల రిలీజ్ డేట్లును ఎనౌన్స్ చేస్తున్నాడు. దాంతో స్టార్లు అందరూ.. ప్రభాస్ సినిమాలను బట్టి, తమ సినిమాల రిలీజ్ లను ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అన్నిటికీ మించి కరోనా మహమ్మారి ప్రభావంలో కూడా ప్రభాస్ అనుకున్న డేట్ ప్రకారమే.. తన సినిమాల షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నాడు. రీసెంట్ గా పట్టుదలతో ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ‘సలార్’ (Salaar)లాంగ్ షెడ్యూల్ కోసం ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోకుండా షూట్ లో పాల్గొంటున్నాడు.

మళ్ళీ సలార్ షెడ్యూల్స్ మధ్యలో ఒకటి రెండు రోజులు గ్యాప్ దొరికినా.. డైరెక్ట్ గా ‘ఆది పురుష్’ షూటింగు కోసం ముంబై వెళ్లి వస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రం కోసం ప్రభాస్ రానున్న రెండు నెలలు పూర్తిగా డేట్స్ ఇచ్చాడు. రామాయణాన్ని దృశ్యకావ్యంగా ఆవిష్కరించడానికి దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు పెట్టిస్తున్నాడు.

కాగా ప్రభాస్ ఈ సినిమాని నవంబర్ నాటికీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఈ ఏడాది నాటికీ ప్రభాస్ మూడు భారీ పాన్ ఇండియా సినిమాలు పూర్తి చేయబోతున్నాడు అన్నమాట. ఇక ఈ ‘ఆది పురుష్’ సినిమాలో సీతాదేవిగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటుస్తున్న సంగతి తెలిసిందే.

Back to top button