సినిమాసినిమా వార్తలు

హ్యాట్రిక్ నానికి ఇది షాకింగ్ న్యూస్

Hero Nani postponed three movies

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లోనే అత్యంత కష్టాల్లో ఉన్నాడనే చెప్పొచ్చు. అందరు హీరోల సినిమాలు అటూ ఇటూగా రిలీజ్ కు నోచుకున్నాయి. కానీ నాని మూవీ విడుదలకు రెడీ అయిన వేళ కరోనా సెకండ్ వేవ్ రావడం ఆయన చిత్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. నాని ప్రస్తుతం మూడు చిత్రాలలో మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘టక్ జగదీష్’లో తన కుటుంబాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగించే ఫ్యామిలీమెన్ పాత్రలో నాని నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 23న విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు డేట్ కూడా ప్రకటించారు. కానీ కోవిడ్ -19 రెండోవేవ్ కారణంగా ఇది వాయిదా పడింది. నానికి ఇది పెద్ద దెబ్బగా మారింది.

నాని ప్రస్తుతం కోల్‌కతా నేపథ్యంలో నిర్మించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘శ్యామ్ సింఘా రాయ్’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కోర మీసంతో నాని ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ లతో మంచి క్రేజ్ వచ్చింది.

ఇక ఈ రెండు మాత్రమే కాదు.. నాని మరొక ప్రాజెక్ట్ కోసం కూడా పనిచేస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ అనే పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో ఒక విలక్షణమైన పాత్రలో కనిపిస్తాడు. ప్రత్యేకమైన కథతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా నిర్మించబడిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ముగ్గురు దర్శకులు నానీకి హ్యాట్రిక్ హిట్లను ఇవ్వాలని పట్టుదలతో ఈ సినిమాలు తీశారు.

దర్శకుడు శివ నిర్వాణ తన మొదటి రెండు చిత్రాలు ‘నిన్ను కోరి’, ‘మజిలి’తో రెండు సూపర్ హిట్స్ ఇచ్చారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘ది ఎండ్‌’కు దర్శకత్వం వహించిన రాహుల్ సంకృతన్ తరువాత కమర్షియల్ హిట్ గా టాక్సీవాలా చేశారు. ఇప్పుడు తన ‘శ్యామ్ సింఘా రాయ్’ను మూడో చిత్రంగా తీశాడు.

ఇక వివేక్ ఆత్రేయ ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచెవరేవరురా’ అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మూడో చిత్రంగా ‘అంటే సుందరానికి’తో నానిని దర్శకత్వం వహించే అవకాశాన్ని పొందారు.

ఈ చిత్రాలలో నాని మూడు అసాధారణమైన పాత్రలను విభిన్న ఛాయలతో పోషిస్తున్నాడు. ఇవన్నీ పాజిటివ్ రోల్స్ గా ఖచ్చితంగా హిట్ ఇచ్చే చిత్రాలుగా నాని నమ్మకంతో ఉన్నారు. ముగ్గురు దర్శకుల మూడో మూవీలు హీరో నానితో హ్యాట్రిక్ హిట్లను ఇస్తారో లేదో చూడాలి.

Back to top button