టాలీవుడ్సినిమా

చైతూకు ‘థ్యాంక్స్‌’ చెప్పేందుకు సమంత, కీర్తి సురేశ్‌ పోటీ!


‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి బ్లాక్‌బస్టర్అం దించిన తమిళ దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్. అక్కినేని మూడు తరాలు ఇందులో నటించారు. ఈ మూవీ చేస్తుండగానే అక్కినేని నాగేశ్వర్రావు కన్ను మూశారు. అయితే, ఈ చిత్రం విడుదలై అద్భుత విజయం సాధించడంతో దివంగత ఏఎన్‌ఆర్ కు ఘన నివాళి అర్పించినట్టయిందని కుటుంబ సభ్యులు భావించారు. అప్పటి నుంచి విక్రమ్‌ అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఆయనపై నాగార్జునకు ఎనలేని భరోసా ఏర్పడింది. దాంతో అఖిల్‌ రెండో సినిమాను విక్రమ్‌ చేతుల్లో పెట్టాడు. అరంగేట్ర చిత్రం ‘అఖిల్‌’ డిజాస్టర్ కాగా.. విక్రమ్‌తో చేసిన ‘హలో’లో నాగార్జున చిన్న కుమారుడు ఫర్వాలేదనిపిపంచాడు. మరోవైపు అక్కినేని కోడలు, నాగచైతన్య భార్య సమంతతో కూడా విక్రమ్‌కు మంచి అనుబంధం ఉంది. మనంతో పాటు సూర్యతో తీసిన ‘24’ మూవీలో సమంతనే హీరోయిన్‌గా తీసుకున్నాడయన. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు. దీనికి ‘థాంక్యూ’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

కథ, స్ర్కిప్ట్‌, బడ్జెట్‌.. ఇలా అన్నీ ఓకే అయినప్పటికీ హీరోయిన్ విషయంలో మాత్రం విక్రమ్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. కీర్తి సురేశ్, అక్కినేని సమంతలో ఎవరిని ఎంచుకోవాలో అనేది తలకు మించిన భారంగా మారిందట. తొలుత ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తిని సంప్రదించినట్టు సమాచారం. కానీ, వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తికి ఈ స్టోరీ నచ్చినప్పటికీ డేట్స్‌ ఖాళీగా లేవట. ఎలాగైనా సరే కాల్షీట్లు సర్దుబాటు చేయాలని చూసోందని సమాచారం. ఒకవేళ ఆమె డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోతే సమంతను హీరోయిన్‌గా ఎంచుకోవాలని విక్రమ్‌ బ్యాకప్‌ ప్లాన్‌ రెడీ చేసుకున్నాడట. ఈ మధ్యే ‘మజిలి’తో భారీ హిట్ సొంతం చేసుకున్న చైతూ- సమంత హిట్‌ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే, మరోసారి ఈ రొటీన్‌ కాంబినేషన్‌ కాకుండా.. హీరోయిన్‌గా కీర్తిని తీసుకుంటే కొత్త కాంబినేషన్‌ సెట్‌ అవుతుందన్నది విక్రమ్‌ ప్లాన్. పైగా, నటనలోనూ, ప్రస్తుత మార్కెట్‌లోనూ కీర్తి హవా నడుస్తోంది. మరి, ఈ మూవీకి కీర్తి, సమంతలో ఎవరు సెట్‌ అవుతారో? చైతన్యకు, డైరెక్టర్కు ‘థ్యాంక్స్‌’ ఎవరు చెబుతారో చూడాలి.

Tags
Show More
Back to top button
Close
Close