సినిమా వార్తలు

అప్పుడు ‘సమంత’.. ఇప్పుడు ‘రష్మిక’

Rashmika
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ‘రష్మిక మండన్నా’ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ‘పుష్ప’లో రష్మికది ఎలాంటి క్యారెక్టర్ ? ఆమె ఎలా కనిపించబోతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఈ సినిమా టీజర్ చూసిన వారందరికీ ఈ సినిమాలో రష్మిక పాత్ర గురించి క్లారిటీ వచ్చేసి ఉండాలి.

‘పుష్ప’ సినిమాని ‘రంగస్థలం’ ఫార్మాట్ లోనే సుకుమార్ తీస్తున్నాడని.. ఇంచుమించు హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. రంగస్థలం సినిమాలో లాగానే కథ జరిగేది పాతిక సంవత్సరాల క్రితం అన్నమాట.పైగా అడవుల నేపథ్యంలో కథాకథనాలు సాగుతాయి. హీరో అల్లు అర్జున్ సినిమా ఆసాంతం రగ్గుడ్ లుక్ లోనే కనిపిస్తాడని ఇప్పటికే సుక్కునే క్లారిటీ ఇచ్చాడు.

‘రంగస్థలం’ సినిమా తీసుకుంటే.. ఆ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా 80ల నాటి పల్లెటూరి యువకుడిగా రగ్గుడ్ లుక్ లోనే కనిపించాడు. ఇక హీరోయిన్ సమంతది కూడా డీగ్లామర్ రోల్.. అలాగే ఆమె పాత్ర కూడా పల్లెటూరి పాత్రనే. ఇప్పుడు ‘పుష్ప’లో కూడా రష్మిక సేమ్ అలాగే కనిపించనుందని.. ఆమెది పల్లెటూరి యువతి పాత్రే అని తెలుస్తోంది. అన్నట్టు రష్మిక ఇటీవలే ‘సుల్తాన్’ సినిమాలో కూడా అలాగే కనిపించింది.

ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక రష్మిక, బన్నీ కాంబినేషన్లో వచ్చే లవ్ సీన్స్ మరియి రొమాంటిక్ గా సాగే సాంగ్స్ అదిరిపోతాయట. మరి ఈ సినిమా హిట్ అయితే, రష్మిక ఇక స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే.

Back to top button