టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

24 గంట‌ల్లో రికార్డు వ్యూస్ దుమ్ములేపిన‌ టీజ‌ర్స్ ఇవే!

 

ఒక‌ప్పుడు సినిమా ఘ‌న విజ‌యాన్ని కాలిక్యులేట్ చేయాలంటే.. ఎన్ని సెంట‌ర్ల‌లో వంద రోజులు ఆడింది అనే లెక్క‌లు బ‌య‌టికి తీసేవారు. ఆ విధంగా సినిమా రికార్డును ఘ‌నంగా చాటుకునేవారు. ఆ త‌ర్వాత సినిమా సాధించిన క‌లెక్ష‌న్స్ గురించి చెప్పుకున్నారు. అదికూడా పాత‌ప‌డిన త‌ర్వాత సినిమా ఓపెనింగ్స్ ను బ‌ట్టి మూవీ స్థాయిని డిసైడ్ చేసే ట్రెండ్ మొద‌లైంది.

ఇప్పుడు న‌డుస్తున్న లేటెస్ట్ ట్రెండ్ ఏమంటే.. ఒక సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్‌ ఎన్ని వ్యూస్‌, ఎన్ని లైక్స్ సాధించింది అని లెక్క‌లు తీస్తున్నారు. ఇందులోనూ ఓవ‌రాల్ గా వ‌చ్చిన వ్యూస్ కు ఒక‌లెక్క‌.. రిలీజ్ చేసిన 24 గంట‌ల్లో సాధించిన వ్యూస్ కు మ‌రో లెక్క అన్న‌ట్టుగా కౌంట్ చేస్తూ.. రికార్డులు రాసుకుంటున్నారు. మ‌రి, ఈ లెక్క‌న రిలీజైన ఒక్క రోజులో అత్య‌ధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజ‌ర్లు ఏంట‌న్న‌ది ఇప్పుడు చూద్దాం.

 స‌ర్కారు వారి పాటః సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ మూవీ స‌ర్కారువారి పాట టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజైంది. మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ టీజ‌ర్ కు ఊహించ‌ని రీతిలో వ్యూస్ వ‌చ్చాయి. ప్రిన్స్ మూవీ కోసం ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌.. త‌మ అభిమానాన్ని మొత్తం యూట్యూబ్ లో చూపించారు. దీంతో.. రిలీజ్ చేసిన 24 గంట‌ల్లో స‌ర్కారు వారి పాట టీజ‌ర్ ఏకంగా 25.7 మిలియ‌న్ల వ్యూస్ సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో ఇదే హ‌య్యెస్ట్ రికార్డు.

పుష్పః 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న‌ది అల్లు అర్జున్ పుష్ప‌. ఈ మూవీ టీజ‌ర్ 22.57 మిలియ‌న్స్ వ్యూస్ సాధించి “త‌గ్గేదే లే.. అని చాటి చెప్పింది.

స‌రిలేరు నీకెవ్వ‌రుః మూడో స్థానంలో కూడా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు టీజ‌రే నిలిచింది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం 14.64 మిలియ‌న్ల వ్యూస్ సాధించి దుమ్ములేపింది.

RRR – వ్యూస్ లో నాలుగో స్థానంలో నిలిచింది RRR. ఈ చిత్రానికి సంబంధించి రెండు టీజ‌ర్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ‌రాజు ఫ‌ర్ భీమ్ అంటూ వ‌చ్చిన టీజ‌ర్ 14.14 మిలియ‌న్ల వ్యూస్ సాధించింది.

సాహోః టాప్ 5లో ఐదో స్థానంలో నిలిచింది యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో మూవీ. బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేశారు. దీంత‌.. టీజ‌ర్ దుమ్ము లేపింది. ఈ టీజ‌ర్ 24 గంట‌ల్లో 12.94 మిలియ‌న్ల వ్యూస్ సాధించి దుమ్ములేపింది.

Back to top button