జనరల్ప్రత్యేకంవ్యాపారము

నిలిచిపోనున్న హైక్‌ మెసెంజర్‌ సేవలు.. ఎప్పటినుంచంటే..?

Hike Messenger

మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉపయోగించే అప్లికేషన్ లలో హైక్ మెసెంజర్ ఒకటనే సంగతి తెలిసిందే. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎనిమిది సంవత్సరాల క్రితం హైక్ మెసెంజర్ సేవలు ప్రారంభం కాగా తక్కువ కాలంలోనే ఈ యాప్ కు యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే వాట్సాప్ యాప్ వినియోగం పెరిగిన తరువాత హైక్ మెసెంజర్ వినియోగం తగ్గింది.

Also Read: వెడ్డింగ్ కార్డ్ పై క్యూఆర్ కోడ్.. చదివింపులు నేరుగా ఖాతాలోకి..?

ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేయడంతో ఈ యాప్ ను వినియోగించడానికి చాలామంది ఆసక్తి చూపారు. 2016 సంవత్సరం ఆగష్టు నెల నాటికి ఈ యాప్ కు రిజిష్టర్ చేసుకున్న 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అతి పెద్ద ఇండియన్‌ ఫ్రీవేర్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ గా హైప్ స్టిక్కర్ చాట్ ను పిలిచేవారు. భారీ సంఖ్యలో యూజర్లు ఉన్న ఈ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు యాప్‌ సీఈవో కెవిన్‌ భారతి మిట్టల్‌ ప్రకటన చేశారు.

Also Read: పాన్ కార్డ్ లేనివారికి శుభవార్త.. పదినిమిషాల్లో పాన్ కార్డు పొందే ఛాన్స్..?

ఈ నెల 21వ తేదీ నుంచి యాప్ సర్వీసులు నిలిచిపోతూ ఉండటంతో ఇకపై హైక్ మెసెంజర్ సర్వీసులను వినియోగించుకోవడం సాధ్యం కాదు. కెవిన్‌ భారతి మిట్టల్‌ తమ యాప్ పై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలని.. మీరు లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్లం కాదని హైక్ మెసెంజర్ యూజర్ల గురించి పేర్కొన్నారు. యాప్ సర్వీసులు ఆగిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హైక్ మెసెంజర్ సర్వీసులను నిలిపివేయడంపై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

ఫేస్ బుక్ కొనుగోలు చేసిన తరువాత వాట్సాప్ యాప్ కొత్తకొత్త ఫీచర్లతో యూజర్లకు మరింత చేరువవుతోంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఎన్నో ఫీచర్లను కలిగి ఉన్న వాట్సాప్ యాప్ ను వినియోగించడానికి ఎక్కువ సంఖ్యలో యూజర్లు ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

Back to top button