వ్యాపారము

కొత్త స్కూటర్ కొనేవాళ్లకు శుభవార్త.. భారీ డిస్కౌంట్..?

ప్రముఖ స్కూటర్ కంపెనీలలో ఒకటైన హోండా కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. తన కంపెనీ స్కూటర్లపై ఈ సంస్థ భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. హోండా డియో స్కూటర్‌ ను కొనుగోలు చేయడం ద్వారా ఏకంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చ్చు. అయితే ఈ క్యాష్ బ్యాక్ ను అందరూ పొందడం సాధ్యం కాదు.

ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డును కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్కూటర్ ను కొనుగోలు చేసి ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకుంటే ఈ ఆఫర్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు వేరియంట్లతో ఈ స్కూటర్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.

స్టాండర్డ్, డీలక్స్ అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉండగా ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.63 వేల నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డును కలిగి ఉన్నవాళ్లకు ఏకంగా రూ.3,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్కూటర్ లో బీఎస్‌6 ఇంజిన్‌తో పని చేసే 110 సీసీ ఇంజిన్ ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కూటర్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాప్స్, సీవీటీ గేర్ బాక్స్, ఇతర ఫీచర్లు ఉన్న ఈ స్కూటర్ కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సమీపంలోని హోండా షోరూంను సంప్రదించి ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Back to top button