అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలుసంపాదకీయం

చంద్రశేఖర్ ఆజాద్ మరణం వెనుక మిస్టరీ? కొన్ని ఆధారాలు ఇవీ

How did Chandrasekhar Azad die? Here are some clues

బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి కాపాడుకునేందుకు ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారిలో చంద్రశేఖర్ ఆజాద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ నేత అయిన ఆజాద్ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి15 ఏళ్ల ముందు మరణించారు. ఆయన మరణం మిస్టరీగా మారింది. బ్రిటిష్ పాలకులు తమ రికార్డుల్లో ఎన్ కౌంటర్లో చనిపోయారని రాసుకున్నారు. కానీ తెల్లదొరల చేతికి చిక్కకుండా రివాల్వర్ తో తనకు తానే కాల్చుకున్నాడన్న మరో వాదన ఉంది. అయితే ఫిబ్రవరి 27న ఆయన మరణించినప్పటికీ ఆజాద్ మరణంపై ఇప్పటికీ రెండు రకాల వాదనలు ఉన్నాయి.

మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలో చంద్రశేఖర్ ఆజాద్ 1906 జూలై 23న జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కోసం వారణాసి వెళ్లారు. 1921లో బెనారస్ సత్యాగ్రహోద్యంతో ఆయనకు స్వాతంత్ర్య కాంక్ష ఏర్పడింది. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను సహించలేకపోయాడు. దీంతో స్వాతంత్రోద్యమంలో తనదైన పాత్ర ఉండేలా చూశాడు. ఈ తరుణంలో ఆయనపై కాకోరీ కేసు నమోదైంది. అలాగే 1929లో జరిగిన బాంబు పేలుడు సంఘటన తరువాత పోలీసుల ఆజాద్ కోసం వెతకడం ప్రారంభించారు.

ఆలహాబాద్ మ్యూజియంలో లభించిన సమాచారం ప్రకారం.. 1931 ఫిబ్రవరి 27న ఉదయం 10.20 గంటలకు ఆజాద్ ఆల్ప్రెడ్ పార్క్ లో ఒక నేరెడు చెట్టుకింద కూర్చొని ఉన్నాడు. అతనితో పాటు సహచరుడు కూడా ఉన్నాడు. ఇక ఇన్ ఫార్మర్ అందించిన సమాచారం ప్రకారం డిప్యూటీ ఎస్పీ ఠాకుల్ విశ్వేశ్వర్ సింగ్, పోలీస్ ఎస్పీ జాన్ నాట్ బావర్ ఆ పార్క్ ను చుట్టుముట్టారు. దీంతో బావర్ ఆజాద్ పై కాల్పులు జరిపారు. మొదటి బుల్లెట్ ఆజాద్ తొడను చీల్చుకుంటూ వెల్లింది. మరుసటి తూటా విశ్వేశ్వర్ సింగ్ కాల్చాడు. అది ఆయన కుడి భుజం గుండా వెళ్లింది.

అయితే ఆజాద్ సహచరుల్లో ఒకరైన విశ్వనాథ్ వైశంపాయస్‘అమర్ షహీద్ చంద్రశేఖర్ ఆజాద్’ అనే పుస్తకాన్ని రచించాడు. అందులో ఆయన ఇలా పేర్కొన్నాడు. ‘నేను అరెస్ట్ అయ్యాక 15 రోజులకు  ఆల్ఫ్రెడ్ పార్క్లో ఆజాద్ అమరుడయ్యాడని తెలుసుకున్నాను. నేను బయట లేను. కాబట్టి దినపత్రికలో అచ్చయిన వార్తల ఆధారంగా ఈ బుక్ లో రాశాను’అని తెలిపారు. అలాగే ‘ఆజాద్, సుఖ్ దేవ్ (ఆజాద్ తో ఉన్న సహచరుడు) ఆ చెట్టు కింద మాట్లాడుకుంటుండగా ఓ బ్రిటిష్ అధికారి వారిద్దరి వద్దకు వచ్చి మీ పేరేంటని అడిగారు. వారి పేర్లు చెప్పగానే ఆ అధికారి తన తుపాకిని తీసి ఆజాద్ పై కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో సుఖ్ దేవ్ అక్కడినుంచి తప్పించుకున్నాడు.

ఇక పోలీస్ ఎస్పీ నాట్ బావర్ విడుదల చేసిన ప్రకటనను కూడా వైశంపాయస్ తన పుస్తకంలో రాశాడు. దాని ప్రకారం.. ‘ఆల్ప్రెడ్ పార్క్లో నేనొక వ్యక్తిని చూశాను. అతడి రూపురేఖలు ఆజాద్ లాగే ఉండడంతో పదిగజాల దూరంలో మీరెవరని అడిగాను. దానికి వాళ్లు పిస్తోల్ తీసి కాల్పులు జరిపేందుకు యత్నించారు. అందులో ఒక వ్యక్తి లావుగా ఉన్నాడు. నేను పిస్తోల్ తీసి రెడీ చేస్తుండగా ఆ వ్యక్తి నాపై కాల్పులు జరిపాడు. అయితే నేను తప్పించుకొని లేచే సరికి ఆ లావాటి వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నారు. ఆయనను వేరే ఎవరైనా కాల్చారా..? లేక తనకు తాను కాల్చకున్నారా..? అనేది చెప్పలేను’ అన్నారు.

ఇదిలా ఉండగా ఆజాద్ పిస్తోల్ ప్రస్తుతం అలహాబాద్ మ్యూజియంలో ఉంది. బ్రిటిష్ వారు ఆజాద్ ను చుట్టుముట్టి కాల్పులు జరపగానే చివరి బుల్లెట్ మాత్రం తనకు తాను కాల్చుకున్నారన్న ప్రచారం ఉంది. ఏదీ ఏమైనా ఆజాద్ మరణంపై ఆరోజుల్లో సవివరంగా నమోదు చేయలేనందన ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే మిగలింది.

Back to top button