గెస్ట్ కాలమ్తెలంగాణరాజకీయాలు

కేసీఆర్ సీక్రెట్స్ బండి సంజయ్ కు ఇలా తెలుస్తున్నాయట!

KCR KTR

తెలంగాణ సీఎం కేసీఆర్ గుట్టుమట్లు అన్నీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎలా తెలుస్తున్నాయని.. ఏదో కేసీఆర్ ఇంట్లో ఉండి చూసినట్టే కేసీఆర్ రహస్యాలన్నీ బండి ఎలా చెబుతున్నాడు? ఆయనకు కేసీఆర్ విషయాలు లీక్ చేస్తున్నదెవరు? ఇలాంటి అనుమానాలు బోలెడు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు వెళ్లాడన్నది బయటపెట్టాడు.

Also Read: ఎల్ఆర్ఎస్ పై హైకోర్టు సంచలన నిర్ణయం

సీఎం కాళేశ్వరం ఎందుకు వెళ్లాడో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నాకు చెప్పారని.. కేటీఆర్ ను సీఎం చేయడానికే ఫాంహౌస్ లో దోష నివారణ పూజలు చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. దోష నివారణ పూజల ఫలాలను కలపడానికి మాత్రమే కేసీఆర్ కాళేశ్వరం వెళ్లాడని బండి సంజయ్ విమర్శించారు.

ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని అంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసని.. కేసీఆర్ ఎందుకు వెళ్లాడనే అనుమానం అందరికీ వచ్చిందని అన్నాడు. నటించడం.. అబద్ధాలు చెప్పడం.. మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట అని అన్నారు.

Also Read: తెలంగాణలో ఇంటర్‌‌ ఎగ్జామ్స్‌ ఎప్పుడంటే..?

కేటీఆర్ ను సీఎం చేయడానికే కాళేశ్వరంకు కేసీఆర్ వెళ్లాడని..కేసీఆర్ తన స్వార్థం కోసం యాగాలు, పూజలు చేస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించాడు.
నిన్న అకస్మాత్తుగా కాళేశ్వరంకు సీఎం వెళ్లాడని అది కూడా శ్రీమతిని తీసుకొని వెళ్లాడని.. తన కల సాకారం అయ్యిందని అంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఆ కల కేటీఆర్ ను సీఎం చేయడమేనని అన్నారు.

కొద్దిరోజులుగా కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని.. ఆయన దిగిపోయి కేటీఆర్ సీఎం అవుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఈ ఊహాగానాల నేపథ్యంలో బండి సంజయ్ ఈ హాట్ కామెంట్స్ చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button