వ్యాపారము

కరోనా వల్ల చనిపోతే రూ.2 లక్షలు.. ఎలా పొందాలంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలలో చాలామంది ఈ స్కీమ్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఈ స్కీమ్స్ యొక్క ప్రయోజనాలను పొందలేకపోతూ ఉంటారు. దేశంలో ప్రతిరోజూ కరోనా వల్ల వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతున్నారు. అయితే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఎవరైతే ఇప్పటికే ఈ స్కీమ్ లో చేరి ఉంటారో వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు లభిస్తాయి. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రతి సంవత్సరం 330 రూపాయలు చెల్లిస్తూ రావాలి. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ లో చేరి ఉంటే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి.

ఎవరైతే ఈ స్కీమ్ లో చేరరో వారి కుటుంబ సభ్యులు ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ ను పొందలేరు. హత్య, సూసైడ్ వల్ల చనిపోయినా కూడా కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే మాత్రం ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందలేరు. కరోనా వల్ల ఎవరైనా చనిపోయి ఉంటే వారి కుటుంబ సభ్యులు మొదట డెత్ సర్టిఫికెట్ ను తీసుకోవాలి.

ఎవరైతే డాక్యుమెంట్లను సమర్పిస్తారో బ్యాంక్ వారి డాక్యుమెంట్లను సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉండగా 55 ఏళ్ల వరకు లైఫ్ కవరేజ్ లభిస్తుంది.

Back to top button