టెక్నాలజీ

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్..!

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో వాట్సాప్ యూజర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. వాట్సాప్ యాప్ వాట్సాప్ డెస్క్ టాప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాట్సాప్ యూజర్ల కొరకు వీడియో కాలింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు.

ఈ ఫీచర్ వినియోగించుకోవాలంటే మొదట వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. వీడియో కాల్ మాట్లాడాలని అనుకున్న వాళ్లను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత వీడియో కాల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మైక్రోసాఫ్ట్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా కాలింగ్ సమయంలో మ్యూట్, అన్ మ్యూట్ చేయవచ్చు. కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా కాలింగ్ సమయంలో ఆన్ లేదా ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది.

యాక్సెప్ట్ కాల్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా ఇన్ కమింగ్ కాల్ ను రిసీవ్ చేసుకునే అవకాశం ఉండగా డిక్లైన్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా ఇన్ కమింగ్ కాల్ ను సులువుగా ఎండ్ చేయవచ్చు. ఇన్ కమింగ్ కాల్ ను ఎత్తకూడదని అనుకుంటే ఇగ్నోర్ లేదా ఎక్స్ టు ఇగ్నోర్ ద బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. డెస్క్ టాప్ లో విండోస్ 10 64 బిట్ వెర్షన్ 1903 లేదా మాక్ ఓఎస్ 10.13 ఉంటే మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తుంది.

మైక్రోఫోన్, కెమెరా, స్పీకర్స్ ఉంటే మాత్రమే డెస్ టాప్ వీడియో కాలింగ్ చేయడం సాధ్యమవుతుంది. మంచి ఆడియో కావాలంటే హెడ్ సెట్ ఉంటే మంచిది. వాట్సాప్ అనుమతి ఉంటే మాత్రమే కంప్యూటర్ మైక్రోఫోన్, కెమెరాను వాడటం సాధ్యమవుతుంది.

Back to top button