జాతీయంరాజకీయాలు

అదనపు కట్నం కోసం భార్యపై భర్త దారుణం?

Husband abused wifeకట్టుకున్న వాడే కసాయివాడయ్యాడు. భార్యను ఇతరుల చేతిలో పెట్టి తన శీలాన్ని తీశాడు. నూరేళ్లు తోడుంటానని చెప్పి తోడేలులాగా పీక్కు తినే విధంగా ప్రవర్తించాడు. భర్త సోదరుడు, అతడి స్నేహితులు భార్యను సామూహిక మానభంగం చేసినా భర్తలో చలనం లేకుండా పోయింది. జరిగిన సంఘటన గురించి చెబితే భర్త చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయింది. అదనపు కట్నం తేకపోతే ఇక రోజు ఇలాగే జరుగుతుందని బెదిరించడం కొసమెరుపు. జీవిత భాగస్వామి ఇలా దారి తప్పడం వెనుక అదనపు కట్నం కావాలనే అతడి వికృత కోరిక దాగి ఉందని తెలుసుకుని ఆమె నిర్ఘాంతపోయింది. ఇక లాభం లేదనుకుని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోకా ఏరియాలో 27 ఏళ్ల వివాహిత భర్తతో కలసి ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త లేని సమయంలో భర్త సోదరుడు, అతడి స్నేహితులు ఇంటికి వచ్చి తలుపులు వేసి ఆమెపై అత్యాచారం చేశారు. అయినవాళ్లే ఇలా నరకాన్ని చూపిస్తుంటే ఏం చేయాలో తోచలేదు. భర్త ఇంటికి వచ్చిన తరువాత జరిగిన విషయం చెబితే నాకు తెలుసు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. తనకు లగ్జరీ కారు, రూ.5 లక్షలు నగదు అదనపు కట్నం ఇవ్వాలని చెప్పాడు. లేకపోతే వారు రోజు వచ్చి ఇలాగే చేస్తారని బదులిచ్చాడు. దీంతో ఆమె నిర్ఘాంతపోయిది.

కట్టుకున్న వాడే ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఇక తనకు దిక్కెవరని ఏడ్చింది. తనకు రక్షణ కావాలని భావించి రాజాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమెకు మూడేళ్ల కిందట పెళ్లయింది. ఆ సమయంలో కట్నం బాగానే ఇచ్చారు. అయితే ఉన్నదంతా ఖర్చు పెట్టిన భర్త ఇప్పుడు తనకు అదనపు కట్నం కావాలని వేధింపులకు గురిచేయడంతో ఆమె భరించలేకపోతోంది. కట్నం తేకపోతే చంపేస్తానని రోజు గొడవ చేస్తుండడంతో విసిగి పోతోంది. ఈ క్రమంలో రెచ్చిపోయిన అతడు తన స్నేహితులతో సామూహిక మానభంగం చేయించడానికి కూడా వెనుకాడలేదు.

భర్త చేతిలో నిత్యం నరకం చూసే ఆ ఇల్లాలు మనసుపై పడిన గాయం ఆమెను తీవ్రంగా వేధిస్తోంది. ఆమె చేసిన తప్పేంటి? అదనపు కట్నం తేకపోవడమేనా? అని అందరు ప్రశ్నిస్తున్నారు. కట్టుకున్న భార్యను ఇతరుల పరం చేయడానికి అతడికి మనసెలా వచ్చిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి భర్త పరారీలో ఉన్నాడు. కానీ అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని అక్కడి మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Back to top button