వ్యాపారము

తక్కువ ధరకు బైక్ కొనేవాళ్లకు షాకింగ్ న్యూస్?

Hyderabad Facebook User Fraud

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో బైక్ అంటూ కొన్ని ప్రకటనలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనల్లో ఎక్కువ ప్రకటనలు మోసపూరిత ప్రకటనలే కావడం గమనార్హం. పోలీసులు, మీడియా మోసపూరిత ప్రకటనల గురించి ప్రజలను అలర్ట్ చేస్తున్నా మోసగాళ్ల మాయమాటలు నమ్మి చాలామంది ఏదో ఒక విధంగా మోసపోతూ ఉండటం గమనార్హం.

Also Read: పేటీఎం ఆఫర్.. సిలిండర్ పై రూ.800 డిస్కౌంట్..?

తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి సైబర్ మోసగాళ్ల మోసం వల్ల భారీ మొత్తంలో నష్టపోయాడు. చింతల్‌ చెరుకుపల్లి కాలనీలో నివశించే రాండు రాజేందర్‌ రెడ్డి అనే వ్యక్తి ఫేస్ బుక్ లో హోండా యాక్టివా కంపెనీకి చెందిన బైక్ కేవలం 20 వేల రూపాయలంటే విక్రయిస్తున్నట్టు ఉన్న ఒక ప్రకటను చూశారు. తక్కువ ధరకే బండి లభిస్తుందని భావించి ఆ బండిని కొనుగోలు చేయాలని అనుకున్నాడు.

ఆ ఫోస్ట్ లో ఉన్న్ ఫోన్ నంబర్ కు కాల్ చేయగా అవతలి వ్యక్తి తాను ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత బైక్ కోసం ఆర్మీ అధికారిని అని చెప్పుకున్న వ్యక్తి గూగుల్ పే ద్వారా రాజేందర్ తో జమ చేయించుకున్నాడు. డబ్బులు జమైన తర్వాత ట్యాక్స్ ‌ల పేరుతో మరో రూ.61,117 జమ చేయించుకున్నాడు. డబ్బులు జమైన తరువాత స్కూటీ డెలివరీ ఖర్చుల నిమిత్తం రూ,1000 పంపించమని మరో వ్యక్తి రాజేందర్ కు కాల్ చేశాడు.

Also Read: రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు మోదీ సర్కార్ శుభవార్త?

అనుమానం వచ్చిన రాజేందర్ సమీపంలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించి జరిగిన మోసం గురించి ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు లభించే వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Back to top button