తెలంగాణరాజకీయాలు

హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్.. అప్పటి నుంచే?


దేశంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతోన్నాయి. ఇదిలా ఉంటే రేపటి నుంచి కేంద్రం విధించిన లాక్డౌన్ 5.0(అన్ లాక్ 1.0) ముగియనుంది. దీంతో కేంద్రం అన్ లాక్ 2.0 అమలు చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా కేంద్రం అన్ లాక్ 2.0లో పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్రం తీరు ఇలా ఉంటే రాష్ట్రాలు మాత్రం లాక్డౌన్ అమలు చేసేందుకే మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీనిని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

తెలంగాణ రాష్ట్రంలోనూ లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు 500నుంచి 900పైబడి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. మహమ్మరి పంజా విసురుతుండటంతో హైదరాబాద్ పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నగరవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర నేతలకు, ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వ్యాపారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లోని పలు ఏరియాల్లో వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వచ్చంధ లాక్డౌన్ చేపట్టారు. హైదరాబాద్లో లాక్డౌన్ ప్రచారంపై తాజాగా మంత్రి ఈటల రాజేందర్ సైతం స్పందించారు. అవసరమైతే జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ అమలు చేసేందుకు వెనుకడే లేదని స్పష్టం చేశారు. దీంతో లాక్డౌన్ అమలు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో నగరవాసులు సైతం ఇందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే నగరవాసులు మార్కెట్లకు పొటెత్తుతున్నారు. అవసరమైన సరుకులను ఇప్పటికే తెచ్చిపెట్టుకున్నారు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

జూలై 1నుంచి ఆన్ లాక్ 2.0 అమలు కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. రెండుమూడ్రోజుల్లో క్యాబినేట్ సమావేశం నిర్వహించి త్వరలోనే నిర్ణయం ప్రకటించున్నారని తెలుస్తోంది. 15రోజులపాటు హైదరాబాద్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేయనుందని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ జూలై 2న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.